ఏటీఎంలలో రోజూ నాలుగైదు సార్లు డబ్బు డ్రా చేస్తున్నారా? అయితే ఇకపై అలాంటివి కుదరవు. ఎందుకంటే రోజుకు ఒక్కసారే ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునే పరిమితి ఇవ్వాలని బ్యాంకులు యోచిస్తున్నాయి. బ్యాంక్, ఏటీఎం మోసాలను నియంత్రించే దిశగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు.
అంతేగాకుండా కమ్యూనికేషన్ ఫీచర్‌తో ఏటీఎంలకు సెంట్రలైజ్‌డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్యాంకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరైనా హెల్మెట్ పెట్టుకుని ఏటీఎంలోకి వెళ్తే... 'హెల్మెట్‌ను తొలగించండి' అనే వాయిస్ వినిపించనుంది. ఇదే విధానాన్ని బ్యాంకులలో కూడా ప్రవేశపెట్టాలని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.