బ్యాంకులకు వరుస సెలవులు.. రెట్టింపుకానున్న కరెన్సీ కష్టాలు

శుక్రవారం, 9 డిశెంబరు 2016 (15:55 IST)
దేశంలోని బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. తాజాగా వరుస సెలవులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. శనివారం రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం సాదారణ సెలవు, సోమవారం ముస్లింల పండుగ మిలాద్ నబీ కావడంతో బ్యాంకులకు సెలవు. 
 
ఇకపోతే.. రూ.500, రూ.1000 నోట్లు రద్దు అనంతరం ఈ రోజుకాకుంటే రేపైనా కరెన్సీ కష్టాలు తీరుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే నోట్లును రద్దుచేసి 30 రోజులు పూర్తి అయినప్పటికీ కరెన్సీ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. గోరుచుట్టుపై రోకలి పోటు చందాన బ్యాంకులకు వరుస సెలవులు వచ్చిపడ్డాయి.
 
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఏటీఎంలు 90 శాతం పైబడి పనిచేయడం లేదు. ఈ పరిస్థితులల్లో మూడు రోజుల పాటు బ్యాంకులూ లేక, ఏటీఎంలు పనిచేయక కరెన్సీ కష్టాలు ఎలా తీరుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి