నూటికి 90 పైగా ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్న భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు తక్కువకాలంలోనే వేగం పుంజుకునేలా చేయాలంటే ప్రజలకు వాతలు పెట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చేసింది. గత నెలరోజులుగా దీనికి సంబంధించి పలు చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఫిబ్రవర్ 1న ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో డిజిటల్ చెల్లింపులతో లావాదేవీలకు మరింత ప్రోత్సాహమిచ్చేందుకు చర్యలు ప్రతిపాదించినట్లు సమాచారం.
తక్కువ నగదు లావాదేవీలకూ పాన్ కార్డును సమర్పించడం తప్పనిసరి చేయడం ద్వారా నగదు లావాదేవీలను సమర్థవంతంగా తగ్గించవచ్చని ప్రభుత్వం నమ్ముతోంది. వాణిజ్యపరమైన లావాదేవీల్లో నగదు వాడకాన్ని నిరుత్సాహ పర్చడానికి గాను వర్తకుల లావాదేవీ పరిమితిని ప్రస్తుతమున్న 2 లక్షల నుంచి లక్ష రూపాయలకు తగ్గించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.