క్వాలిటీ ఐస్ క్రీమ్ కంపెనీ క్వాలిటీ లిమిటెడ్ బ్యాంకులకు టోపి పెట్టింది. కోట్లలో మోసం చేసినట్లు సీబీఐ తెలిపింది. తప్పుడు లెక్కలు చూపించి బ్యాంకుల్లో కోట్లలో రుణాలు పొందాయని గుర్తించారు. ఈ మేరకు కంపెనీకి చెందిన ఎనిమిది మందిని సీబీఐ అధికారులు విచారణ జరిపారు. విచారణలో క్వాలిటీ లిమిటెడ్ చేసిన మోసాలు వెలుగులోకి వచ్చాయి.
కంపెనీకి చెందిన ఎనిమిది మందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. బ్యాంకు రుణాలు చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ స్కాంలో క్వాలిటీ లిమిటెడ్ డైరెక్టర్లు సంజరు ధింగ్రా, సిద్ధాంత్ గుప్తా, అరుణ్ శ్రీవాస్తవ్ భాగస్వాములుగా కొనసాగుతున్నారు.
బీఒబీ ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ కొనసాగించింది. ఈ మేరకు విచారణలో క్వాలిటీ కంపెనీ మొత్తం అమ్మకాలు రూ.13,147.25 కోట్లుగా చూపింది. ఇందులో రూ.7,107.23 కోట్లు మాత్రమే బ్యాంకుల నుంచి రుణం పొందినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌ను సీబీఐకి సమర్పించింది.
రివర్స్ ఎంట్రీలు చేసి ఖాతాలను తారుమారు చేసి క్వాలిటీ లిమిటెడ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినట్లు బ్యాంక్ ఆప్ ఇండియా ఆరోపించింది. 2018 చివరి నాటికి క్వాలిటీ చాలా బ్యాంకుల నుంచి దాదాపు రూ.1900 కోట్లు అప్పు తీసుకుంది. ఇందులో రూ.520 కోట్లు చెల్లించింది. మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఈ కంపెనీపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.