పలు రాష్ట్రాల్లో షట్ డౌన్ల కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. 33 లక్షల మంది ప్రజలు నిరుద్యోగ లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజా అంచనాల ప్రకారం సేల్స్, ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తులు, సేవల విభాగాలలో ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. క్షురకులు, రెస్టారెంట్ సర్వర్లు, ఫ్లైట్ అటెండెంట్లు కూడా భారీగా నిరుద్యోగులుగా మారనున్నారని ఆ సంస్థ నివేదిక పేర్కొంది.
మరి భారత్ మాత్రం ఇతర దేశాలతో పోల్చితే సురక్షితంగా ఉంది. ముఖ్యంగా, కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలోనూ ఇతర దేశాలతో పోల్చితే ఒక అడుగు ముందుగానే ఉంది. అలాగే, ఆర్థిక వ్యవస్థ కూడా బాగా పటిష్టంగానే ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక కూడా తేల్చింది. దీంతో అయితే, లాక్‌డౌన్ తర్వాత చాలా మంది నిరుద్యోగులు అయ్యే అవకాశాలు ఉన్నాయనీ, ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువగా ఉంటుందని పలువురు అభిప్రాయడుతున్నారు.