జనవరి 1తో ముగియనున్న పాత కరెన్సీ నోట్ల గడువు!

సోమవారం, 22 డిశెంబరు 2014 (19:23 IST)
2005 కంటే ముద్రించిన కరెన్సీ నోట్లు జనవరి ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కావు. వీటిలో రూ.100, రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. దీంతో ఈ నోట్లను మార్చుకునేందుకు జనవరి ఒకటో తేదీ వరకు భారత రిజర్వు బ్యాంకు గడువు ఇచ్చింది. 
 
2005 కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ 2014 జనవరి 22వ తేదీన ప్రజలకు తెలిపింది. ఆర్బీఐ ప్రకటించిన అనంతరం సుమారు 144.66 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో మార్చుకున్నట్టు సమాచారం. 2005 తర్వాత తాము ముద్రించిన కరెన్సీ నోట్లపై నోటు తయారు చేసిన యేడాదిని పేర్కొన్నామని, అంతకుముందు ముద్రించిన కరెన్సీపై సంవత్సరం ఉండదని ఆర్బీఐ వివరించింది. 

వెబ్దునియా పై చదవండి