మోదీ దెబ్బ... బ్యాంకుల్లో జనం సొమ్ము రూ.5,00,000 కోట్లు జమ, ఐసీఐసీకి రూ. 32,000 కోట్లు
ఒకే ఒక్క ప్రకటనతో జనం సొమ్మంతా నేరుగా బ్యాంకుల్లో జమైపోతోంది. నల్లధనం ఉన్నవాళ్లు గుల్ల అవుతున్నారో ఏమోగానీ బ్యాంకులకు మాత్రం డబ్బులు వచ్చిపడుతూనే ఉన్నాయి. నవంబరు 8న మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాక ఇప్పటివరకూ అన్ని బ్యాంకుల్లోనూ సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లు గణాంకాలు చెపుతున్నాయి.