మిర్చి పంట కోసం ధనుకా నుంచి అత్యంత శక్తివంతమైన కీటక సంహారిణి డిసైడ్‌

గురువారం, 1 సెప్టెంబరు 2022 (17:51 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ పురుగుమందుల కంపెనీలలో ఒకటైన ధనుకా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ అత్యంత శక్తివంతమైన కీటక సంహారి “డిసైడ్‌” అనే పురుగుమందును దక్షిణ భారత దేశంలో విడుదల చేసింది. ఈ అత్యంత శక్తివంతమైన కీటక సంహారిణి మిర్చి పంటలో రసం పీల్చే పురుగులపై సమర్ధవంతంగా పనిచేయడంతో పాటుగా రైతులకు నల్లి పురుగు, తామరపురుగు, తెల్లదోమ వంటి కీటకాలపై ఒకే పిచికారి స్ప్రే తో రైతులకు నియంత్రణ అందించటంలో తోడ్పడుతుంది. ‘‘డిసైడ్‌” ఒక వినూత్నమైన పురుగుమందు.

 
డిసైడ్‌ ఏకరీతి చర్య కలిగిన రెండు పురుగు మందుల కలయిక. డిసైడ్‌ను మిత్సుషి కెమికల్స్‌ జపాన్‌, ధనుకా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ పరస్పర సహకారంతో భారత్‌ ఉపఖండంలోకి తీసుకుని వస్తుంది. డిసైడ్‌ ఒక అత్యంత శక్తివంతమైన కీటక సంహారిణి. డిసైడ్‌ నీటిలో కరిగే గుళికల రూపంలో లభ్యమవుతుంది. మిరప పంటను సోకే రసం పీల్చు పురుగులపై అత్యంత సమర్ధవంతంగా పనిచేయటంతో పాటు, రైతులకు మిరప పంటను సోకే నల్లి, తామరపురుగు- తెల్లదోమల బెడద నుండి ఒకే పిచికారితో కాపాడుతుందని, ఇతర పురగు మందులను కలపాల్సిన అవసరం లేదని ఈ డిసైడ్‌ ఉత్పత్తిని విడుదల చేసిన అనంతరం ధనుకా అగ్రిటెక్‌ లిమిటెడ్‌, నేషనల్‌ సేల్స్‌ హెడ్‌ శ్రీ అభిషేక్‌ ధనుకా గారు తెలిపారు.

 
ధనుకా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ గతంలో ఉత్తర, తూర్పు మరియు పశ్చిమ భారతదేశాలలో 9(3) మాలిక్యూల్‌ రూపంలో విడుదల చేసింది. దేశంలో మిర్చిపంట దిగుబడి 67% ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో రైతులు సాధిస్తున్నారు. వీరు ఇటీవల నూతన కీటకం నల్లి, తామర పురుగు కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కీటకాన్ని 2020లో ఎర్ర మిరప పంటలో తొలిసారిగా తెలంగాణా- ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించారు. ఈ కీటక సంతతి 2021లో గణనీయంగా పెరిగింది. ఈ కీటకం కారణంగా మిరపమొక్కలో పుష్పించే దశపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా అది ఫలవంతం కాకుండా పోతుంది. ఈ కారణంగా పూలు రాలిపోవటం, పంట దిగుబడి గణనీయంగా తగ్గడమూ జరుగుతుంది.

 
తాజాగా డిసైడ్‌ కీటక నాశిని ప్రభావాలను గురించి ఆయన మరింత వివరంగా వెల్లడిస్తూ సరైన మొత్తంలో, సరైన నాణ్యత కలిగిన సరైన కీటకనాశినులను వినియోగించడంతో పాటుగా తగిన సమయంలో వాటిని వాడటమూ అత్యంత కీలకం. అప్పుడే పంట తగిన రీతిలో ఎదగడంతో పాటుగా కీటకాల నియంత్రణ కూడా సాధ్యమవుతుంది. ధనుకా కంపెనీ సాంకేతికంగా అత్యంత వైవిధ్యమైన ఉత్పత్తులను కంపెనీ విడుదల చేయడం ద్వారా రైతులు తమ పంటను కాపాడుకునేందుకు దిగుబడులను పెంచుకునేందుకు తోడ్పడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు