ఎస్.బి.ఐ లైఫ్ నుంచి పాపా హై నా - ఫాదర్ హార్ట్‌ఫెల్ట్ జర్నీ

ఠాగూర్

బుధవారం, 18 జూన్ 2025 (13:50 IST)
లక్ష్యం దన్నుగా, ప్రేమపూర్వకమైన మార్గదర్శకత్వంతో హామీలను నిలబెట్టుకోవడంలో ఒక తండ్రి ప్రస్థానాన్ని ప్రతిబింభించే ఎస్‌బీఐ లైఫ్ #PapaHaiNa చిత్రం. చాలా సందర్భాల్లో తండ్రులు నిశ్శబ్దంగా తమ కుటుంబానికి మొక్కవోని చిత్తశుద్ధితో శక్తి, స్థిరత్వాన్ని అందించే మూలస్తంభంగా నిలుస్తుంటారు. తమ కుటుంబ సభ్యుల సంక్షేమానికి, వారి భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ తండ్రులు ఇటు వ్యక్తిగత, అటు వృత్తిగత బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా, తండ్రి అందించే శక్తిని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో వారు చూపే చిత్తశుద్ధిని హృదయానికి హత్తుకునే విధంగా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తమ #PapaHainNa డిజిటల్ ప్రాపర్టీ కింద 'పాపా భూల్తే నహీ' అనే డీవీసీని రూపొందించింది. 
 
నిత్యం పలు రకాల పాత్రలను పోషిస్తున్నా, తమ ప్రియమైన వారికి ఇచ్చిన హామీలను ఎన్నడూ మర్చిపోని నాన్నలకు ఇది అంకితం. ఆప్యాయత, క్రమశిక్షణ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే స్వభావం గల నాన్నల జీవితంలోని క్షణాలను ఇది ఆవిష్కరిస్తుంది. 
 
ఒక హాకీ కోచ్, ఒక ఫారెస్ట్ ఆఫీసర్, ఒక ఆర్కిటెక్ట్ ఇలా ముగ్గురు నాన్నల వృత్తిగత ప్రపంచాలను ఆవిష్కరించడంతో డీవీసీ మొదలవుతుంది. వారు తమ తమ రంగాల్లో ఆత్మవిశ్వాసంతో రాణిస్తుంటారు. స్ట్రైకర్‌కు సూచనలు ఇస్తూ, రేంజర్లకు ఆదేశాలిస్తూ, లేదా రోడ్ సైట్‌ను పర్యవేక్షిస్తూ, దిశా నిర్దేశాన్ని, క్రమశిక్షణను, సంకల్పాన్ని ప్రతిబింభిస్తూ, వారి చేతులు ప్రధాన కేంద్రంగా నిలుస్తాయి. 
 
ఆ తర్వాత కట్ చేస్తే, తమ ఉద్యోగ విధుల్లో భాగంగా ఏ చేతులైతే మార్గనిర్దేశం చేశాయో, అవే చేతులు ఇంటికి వచ్చేసరికి పిల్లలను ఊయలూపుతూ, బొమ్మలతో ఆడిస్తూ, అచ్చెరువొందించే బిల్డింగ్ బ్లాక్స్‌ టవర్‌ను రూపొందిస్తూ కనిపిస్తాయి. ఈ వైరుధ్యమనేది చాలా చిన్నదే అయినప్పటికీ చాలా శక్తివంతమైనది: అధికారంతో ఆదేశాలిచ్చే తండ్రులు అంతే ప్రేమగా లాలిస్తారు కూడా. 
 
మొక్కవోని నిబద్ధతతో వారు ఏ విధంగా, సునాయాసంగా వివిధ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తారనేది ఈ చిత్రం తెలియజేస్తుంది. డాక్టర్లు, రైతులు, ఫైర్‌ఫైటర్లు, ఉపాధ్యాయులు ఇలా వివిధ పాత్రల్లో తమ తమ ప్రొఫెషన్లలో రాణించడంతో పాటు అన్నింటికి మించి అర్థవంతమైన తండ్రి పాత్రను సమర్ధవంతంగా పోషించే నాన్నలను చూపించే మొజాయిక్‌తో చిత్రం ముగుస్తుంది. 
 
“జో అప్నే ఇరాదే ఔర్ అప్నోం సే కియే వాదే కభీ భూల్తే నహీ.. వో పాపా హై నా” (తమ సంకల్పాన్ని, తమకు ప్రియమైన వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోని వ్యక్తి ..నాన్న ఉన్నారుగా) అంటూ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇది అందిస్తుంది.
 
డిజిటల్ వీడియో ఆవిష్కరణ సందర్భంగా, “చాలా సందర్భాల్లో తండ్రులు, స్థిరంగా, నిస్వార్ధంగా, మొక్కవోని నిబద్ధతతో మన జీవితాల్లో నిశ్శబ్దంగా కీలక పాత్ర పోషిస్తుంటారు. వారు తమ భావోద్వేగాలను గట్టిగా బైటికి వ్యక్తపర్చకపోవచ్చు, కానీ తమకెంతో ప్రియమైన వారికి ఇచ్చిన వాగ్దానాలను వారు ఎన్నటికీ మర్చిపోరు. ఎస్‌బీఐ లైఫ్ యొక్క #PapaHainNa డిజిటల్ ప్రాపర్టీ కింద రూపొందించిన “పాపా భూల్తే నహీ” (నాన్న మర్చిపోరు) తాజా డిజిటల్ చిత్రమనేది, మొక్కవోని అంకితభావంతో బాధ్యతలు, బంధాల మధ్య సమతూకాన్ని పాటిస్తూ, నిశ్శబ్ద శక్తిగా అండగా నిలుస్తూ, జీవితాన్ని సాగించే నాన్నలకు అంకితం. 
 
లక్ష్యంతో కూడుకున్న జీవితాన్ని జీవించడం ఎంతో శక్తివంతమైనదని ఎస్‌బీఐ లైఫ్ విశ్వసిస్తుంది. మన కోసమే కాదు మనకు ఎంతో ప్రియమైన వారి కోసం ఏదైనా చేయడంలో ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. ‘అప్నే లియే, అప్నోం కే లియే’ అనే మా బ్రాండ్ తత్వాన్ని ప్రతిఫలించే ఈ డీవీసీ ద్వారా నాన్నలకు సెల్యూట్ చేస్తున్నాం” అనిఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆఫ్ బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ సీఎస్ఆర్ రవీంద్ర శర్మ తెలిపారు. 
 
“స్ఫూర్తివంతమైన మా ఫాదర్స్ డే క్యాంపెయిన్‌తో ‘పాపా హై నా’ సారాంశాన్ని మరింత లోతుగా తెలియజేసేలా ఎస్‌బీఐ లైఫ్‌తో మరోసారి జట్టు కట్టడం మాకు గర్వకారణం. తమకెంతో ప్రియమైన వారికి ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటూ జాతి నిర్మాణంలో తండ్రులు పాలుపంచుకునే క్రమాన్ని ఈ చిత్రం అందంగా ఆవిష్కరించింది” అని డెంట్సు క్రియేటివ్ ఐసోబార్ ప్రెసిడెంట్ సాహిల్ షా చెప్పారు. 
 
జీవితకాల నిబద్ధతతో తండ్రి ఎంతో శక్తివంతంగా, అండగా నిల్చే క్రమాన్ని ఎస్‌బీఐ లైఫ్ ఆవిష్కరించింది. బ్రాండ్ తత్వానికి అనుగుణంగా ఈ క్యాంపెయిన్ అనేది, నిలకడగా, నిశ్శబ్దంగా, హృదయపూర్వకంగా వెన్నంటి నిలవడమే సిసలైన భద్రత అనే భావనను తెలియజేస్తుంది. డిజిటల్, సోషల్ మీడియాలో ఈ డిజిటల్ వీడియో ఆవిష్కరించబడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు