ఇండోనేషియా నిర్ణయంతో దేశంలో పెరగనున్న నూనె ధరలు

ఆదివారం, 30 జనవరి 2022 (15:32 IST)
గత యేడాది దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో అనేక పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, వివిధ రకాలైన నూనె పంటలు కూడా వర్షానికి బాగా దెబ్బతిన్నాయి. ఈ కారణంగా వంట నూనెల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. ఫలితంగా నూనెల ధరలు మరోమారు సామాన్యులకు చుక్కలు చూపించనున్నాయి. 
 
ప్రస్తుతం దేశంలో వంట నూనెలల దిగుబడి తగ్గిపోవడంతో ఇండోనేషియా వంటి దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, భవిష్యత్‌లో వంట నూనెల దిగుబడిని బాగా తగ్గించుకోవాలని ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇది మన దేశంలో వంట నూనెల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం లేకపోలేదు. భారత్ దిగుమతి చేసుకుంటున్న పామాయిల్‌లో 60 శాతం మేరకు ఒక్క ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు