భారత్ బయోటెక్ పొందిన సమాచారం ప్రకారం, సుమారు 5,000 మంది వాలంటీర్లపై ఈ క్లినికల్ అధ్యయనాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వారిలో సగం మంది కోవాక్సిన్ తీసుకునివున్నారు. మిగిలిన సగం మంది కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నవారు ఉన్నారు. రెండో మోతాదు తీసుకుని 6 నుండి 9 నెలల సమయం పూర్తయిన వారిపై ఈ చుక్కల మందు బూస్టర్ డోస్ ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాల తర్వాత ఫలితాలను మళ్లీ డీసీజీఐ ముందు ఉంచుతారు. ఆతర్వాత ఈ చుక్కల మందుకు అత్యవసర అనుమతి లభించే అవకాశం ఉంది.