పురుషులకు ముఖ, చర్మ సౌందర్యానికి అత్యద్భుతమైన బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్. ఈ ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్ బ్రాండ్ ఇమామి వారిది. ఇప్పుడు ఇమామి లిమిటెడ్ తన ఐకానిక్ మెన్స్ బ్రాండ్ అయినటువంటి ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్‌కు సరికొత్త గుర్తింపుని ఇచ్చేందుకు ఈ ఉత్పత్తిని స్మార్ట్ అండ్ హ్యాండ్ సమ్‌గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్ హార్డ్ త్రోబ్ కార్తీక ఆర్యన్ ఇప్పుడు దీనికి కొత్త అంబాసిడర్‌గా మారాడు. ఈ కీలకమైన మార్పు చాలా సాహసోపేతమైన ముందడుగును సూచిస్తుంది.
దాదాపు రెండు దశాబ్దాలుగా పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో బ్రాండ్ యొక్క నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా మరింత సమగ్రమైన సౌందర్య పద్ధతుల వైపు సాంస్కృతిక మార్పును ఇది స్వీకరించింది. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలతో, నేటి యువకులు చర్మ ఆరోగ్యానికి, సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. స్మార్ట్ అండ్ హ్యాండ్ సమ్ ఇప్పుడు వారి అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉంది.
"నేటి డైనమిక్ యువతరం కోసం మేము విస్తృతమైన సౌందర్య అవసరాలను పరిష్కరించడానికి ఒక అద్భుతమైన అవకాశం కోసం చూస్తున్నాము. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ నుండి స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ కు రీబ్రాండింగ్ అనేది వినియోగదారుల ఇన్ సైట్స్ ద్వారా నడిచే వ్యూహాత్మక నిర్ణయం. ఇది వ్యక్తిత్వం, వైవిధ్యం, విశ్వాసం వైపు దృష్టి సారిస్తుంది. నేటి యువకులలో సహజమైన చర్మ ఆరోగ్యం అనేక లేటెస్ట్ ఉత్పత్తి ఫార్మాట్లకు ఎక్కువగా అందుబాటులో ఉంది. ఇప్పుడు బాలీవుడ్ హార్ట్ త్రోబ్ కార్తీక్ ఆర్యన్ ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం వల్ల ఈ రిఫ్రెష్ గుర్తింపును స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్గా అందించగలదని మేము విశ్వసిస్తున్నాము. అభివృద్ధి చెందుతున్న పురుష గ్రూమింగ్ మార్కెట్లో మా నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయడం కోసం మేం సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు ఇమామి లిమిటెడ్ వైస్ చైర్మన్ మరియు హోల్‌టైమ్ డైరెక్టర్ శ్రీ మోహన్ గోయెంకా.
ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ కూడా మాట్లాడాడు. "నేను స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ యొక్క ఫేస్‌గా ఇమామి కుటుంబంలో చేరినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. ఈ రోజు గ్రూమింగ్ చర్మ సౌందర్యానికి అతీతమైనది. విశ్వాసం, వ్యక్తిత్వం, స్వీయ-వ్యక్తీకరణను మరింత ఇనుమడింపచేస్తుంది. బ్రాండ్ యొక్క గ్రూమింగ్ నాతో మరింతగా ప్రతిధ్వనిస్తుంది. లేటెస్ట్ యువకులకు సమర్ధవంతమైన పరిష్కారాలను అందిస్తోంది. ఈ ఎక్స్సైటింగ్ ప్రయాణంలో భాగం కావాలని ఎదురుచూస్తున్నాను." అని అన్నారు ఆయన.
2024లో భారతదేశపు పురుష గ్రూమింగ్ మార్కెట్ ₹18,000 కోట్లుగా అంచనా వేయబడినందున, ఈ మార్పు మారుతున్న ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ పురుషులు తమ విశ్వాసాన్ని పెంచే ఉత్పత్తులపై ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు.