ఈపీఎఫ్‌వో ఖాతాలను బదిలీ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో ) కీలక ఆదేశాలను ప్రవేశపెట్టింది. చాలా మంది కార్మికులు తరచుగా వారి ఈపీఎఫ్‌వో ఖాతాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఖాతా బదిలీలు, వ్యక్తిగత వివరాలను నవీకరించడం లేదా కంపెనీ నుండి నిష్క్రమించే తేదీని నమోదు చేయడం వంటి సమస్యలు ఉద్యోగులకు నిరాశను మిగుల్చుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి,ఈపీఎఫ్‌వో నిరంతరం మార్పులు చేస్తోంది. తాజా ఖాతా బదిలీలను మరింత సులభతరం చేస్తుంది.
శనివారం నుండి, EPF ఖాతాదారులు ఇప్పుడు వారి యజమానుల ప్రమేయం లేదా ఆమోదం లేకుండా వారి ఖాతాలను బదిలీ చేయవచ్చు. ఈ కొత్త చర్య యజమానులను సంప్రదించవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. ఉద్యోగుల సమయం, కృషిని ఆదా చేస్తుంది. అయితే, ఈ సౌకర్యం అక్టోబర్ 1, 2017 తర్వాత జారీ చేయబడిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉన్న ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇవి ఆధార్‌తో అనుసంధానించబడి ఉంటాయి.
వ్యక్తిగత వివరాలకు మార్పులు వంటి నవీకరణలు లేదా బదిలీల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల కోసం, ఈపీఎఫ్‌వో ఆ దరఖాస్తులను ఉపసంహరించుకోవాలని సలహా ఇస్తుంది.ఉద్యోగులు ఇప్పుడు స్వతంత్రంగా సంప్రదింపుల ఆన్‌లైన్‌లో చేయవచ్చు. అయితే, 2017కి ముందు సృష్టించబడిన ఖాతాలు ఈ సదుపాయానికి అర్హత పొందవు. ఈ ఖాతాల బదిలీలు లేదా నవీకరణలకు ఇప్పటికీ యజమాని జోక్యం అవసరం. ఇకపై ఆ అవసరం వుండదు.