డిసెంబర్ 31నాటికి ఆధార్‌, పాన్‌కార్డులతో అనుసంధానం చేయాల్సిందే..!

బుధవారం, 11 నవంబరు 2020 (15:34 IST)
ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి బ్యాంక్‌ ఖాతాలన్నింటిని ఆధార్‌తో అనుసంధానం చేయాలని, అవసరమైనప్పుడు పాన్‌కార్డులతో కూడా లింక్‌ పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు.

అలాగే ఖాతాదారులకు కార్డులకు జారీలో రూపే కార్డులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ సూచించారు. వ్యవస్థలో ధృవీకరించని బ్యాంక్‌ ఖాతా ఉండకూడదని ఆదేశించారు. బ్యాంకింగ్‌లో యూపీఐ చెల్లింపులు సహజంగా మారిపోవాలని కృషి చేయాలని బ్యాంకర్లకు ఆమె సూచించారు.
 
ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) 73వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎన్‌పీసీఎల్‌ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) భారత బ్రాండ్‌ ప్రొడక్ట్‌గా మారే అవకాశాలున్నాయి. ఎన్‌పీసీఐ నిర్వహించే రూపే కార్డులనే ఇవ్వాలని ఆమె సూచించారు. భారతీయ బ్యాంకులు అద్భుతంగా పనిచేశాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు