రైలు ప్రయాణికుల భద్రత కోసం.. కొత్త కోచ్‌లు

మంగళవారం, 27 జులై 2021 (13:19 IST)
రైలు ప్రయాణికుల భద్రత విషయంలో ఇండియన్ రైల్వేశాఖ అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతుంది. తరచూ రైళ్ళల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని ఆస్తి నష్టంతోపాటు, ప్రాణనష్టం వాటిల్లుతుండటంతో ప్రమాదాల నివారణపై దృష్టిసారించింది. అగ్రిప్రమాద నిరోధక రైల్వే కోచ్‌లను రూపొందిచాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది.
 
కపుర్తలా లోని ఇండియన్ రైల్వే ప్రధాన కర్మాగారంలో ఈ ఫైర్ రిటార్డెంట్ రైల్వే కోచ్‌లును ప్రస్తుతం తయారు చేసే ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. త్వరలో వీటి పనితీరును పరిశీలించిన అంతా బాగుందనుకుంటే అన్ని కోచ్‌లను అగ్ని నిరోధక కోచ్‌లుగా మార్పులు చేయాలన్న ఆలోచనలో రైల్వే ఉన్నస్థాయి వర్గాలు ఉన్నాయి. ఫైర్ రిటార్డెంట్ రైల్వే కోచ్ లలో ఎంసీబీలు, విద్యుత్ బోర్డులు, కనెక్టర్లు, ఇతర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ లకు నాణ్యమైన వస్తువులను వినియోగించనున్నారు. 
 
రైల్వే కోచ్ నిర్మాణం మొత్తం పూర్తిస్ధాయిలో ఫైర్ రిటార్డెంట్ ఫర్నీచర్‌ను వినియోస్తున్నట్లు రైల్ కోచ్ ఫ్యాక్టరీ మేనేజర్ రవీందర్ గుప్తా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ కోచ్ లు అందుబాటులోకి వస్తే రైల్వేల్లో అగ్నిప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు