భగ్గుమంటున్న చమురు ధరలు... రికార్డు స్థాయికి పెట్రోల్ - డీజల్

ఆదివారం, 13 జూన్ 2021 (10:57 IST)
దేశంలో పెట్రోల్ చమురు ధరలు భగ్గున మండిపోతున్నాయి. ఫలితంగా పెట్రోల్, డీజల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ ధరలతో సామాన్యులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. తాజాగా మళ్లీ పెట్రోల్‌, డీజిల్ పై 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
 
ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.96.12 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.86.98 కి చేరింది. అలాగే, ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.30, డీజిల్ రూ.94.39 కు పెరిగింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.43 ఉండగా.. డీజిల్‌ రూ.91.64 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.06 గా.. డీజిల్‌ ధర రూ.89.83 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.33 డీజిల్‌ రూ.92.21 గా ఉంది.
 
ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే, తెలంగాణ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.99.90, లీటర్‌ డీజిల్‌ రూ.94.82 కు పెరిగింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.60, డీజిల్ ధర 94.54 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.102.25 గా ఉండగా.. రూ. 96.58 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 101.05 ఉండగా.. డీజీల్ ధర రూ.95.41 గా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు