దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల గగ్గోలుపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ధరల బాదుడు మోత పెరుగుతూనేవుంది. ఈ క్రమంలో తాజాగా మరోమారు పెట్రోల్, డీజల్ ధరలు పెంచారు.
జూన్ నెల పుట్టిన తర్వాత ఐదోసారి చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పటికే రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకోగా.. బుధవారం లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.56కి చేరగా.. డీజిల్ ధర రూ.86.47కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్ ధర రూ.102 వైపు పరుగులు పెడుతుండగా.. ప్రస్తుతం రూ.101.76, డీజిల్ రూ.93.85 పలుకుతోంది.
కోల్‌కతాలో పెట్రోల్ రూ.95.52, డీజిల్ రూ.89.32, చెన్నైలో పెట్రోల్ రూ.96.94, డీజిల్, రూ.96.94కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.99.32, డీజిల్ రూ.94.26.. విజయవాడలో పెట్రోల్ రూ.101.55, డీజిల్ రూ.95.90కి చేరింది.