ఆంధ్రా - తెలంగాణాల్లో ఒక సవర బంగారం రేటు ఎంతో తెలుసా?

మంగళవారం, 5 అక్టోబరు 2021 (08:56 IST)
దేశంలో పండగ సీజన్ ఆరంభమైంది. మరోవైపు బంగారు ఆభరణాల విక్రయాలు కూడా జోరందుకున్నాయి. దీంతో పసిడి, వెండి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ ధరలు పెరిగాయి. 
 
సోమవారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర మంగళవారం కూడా పెరిగింది. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మంగళవారం (అక్టోబర్‌ 5) దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 నుంచి 170 వరకు పెరిగింది. 
 
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది.
 
అలాగే, ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,820 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు