బంగారం ధరల దూకుడు బ్రేక్

సోమవారం, 19 జులై 2021 (10:56 IST)
దేశంలో బంగారం ధరల దూకుడు తాత్కాలిక బ్రేక్ పడింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. 
 
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.260 త‌గ్గి 44,990కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.370 త‌గ్గి రూ.49,000కి చేరింది.
 
ఇక బంగారం ధ‌ర‌ల‌తో పాటు వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధ‌ర రూ.1100 మేర తగ్గి రూ.73,200కి చేరింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ప్రియులు పసిడిని కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపించడంతో ఈ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు