స్వల్పంగా పెరిగిన బంగారం: కిలో వెండిపై రూ.200లకు పెంపు

బుధవారం, 7 జులై 2021 (09:58 IST)
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతీరోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశీయంగా వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతోపాటు వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. కిలో వెండిపై రూ.200 వరకు పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బుధవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550గా ఉంది. కిలో వెండి ధర రూ. 70,600 లుగా ఉంది. 
 
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ. 75,200 లుగా కొనసాగుతోంది.
 
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 గా ఉంది. వెండి ధర రూ. 75,200 లుగా ఉంది.
 
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 గా ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ. 75,200 లుగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు