బంగారం కొనుగోలు చేయాలనుకుంటే..?

బుధవారం, 14 సెప్టెంబరు 2022 (12:06 IST)
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు మంగళవారం దాదాపు రూ.500 మేర దిగి వచ్చింది. 
 
దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 50,140కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పడిపోవడం సహా ట్రేడర్లు పొజిషన్లను తగ్గించుకోవడం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 
 
అమెరికా ద్రవ్యోల్బణం అంచనాల కన్నా ఎక్కువగా నమోదు కావడంతో డాలర్ పుంజుకుంది. దీంతో బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుతూ వస్తోంది. వెండి రేటును గమనిస్తే.. 1.4 శాతం మేర తగ్గింది. రూ. 56,690 వద్ద కదలాడుతోంది.
 
మరోవైపు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 13న బంగారం ధరలను గమనిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980 వద్ద ఉంది. 
 
అలానే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఇది పది గ్రాములకు రూ. 46,730 వద్ద ఉంది. గత మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేటు ఈ రోజు నేల చూపులు చూడటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు