మూడో రోజు కూడా పతనమైన పసిడి ధరలు... కొనేస్తారా?

బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:10 IST)
బంగారం ధరలు బుధవారం కూడా బాగా తగ్గాయి. గ్లోబల్ వాణిజ్యంలోని వచ్చిన తేడాల వల్ల బంగారం ధరలపై ప్రభావం చూపి ధరలు తగ్గినట్లు నిపుణులు చెపుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 మేరకు తగ్గింది. ఫలితంగా రూ.39,110 నుంచి రూ.38,770 మేరకు బంగారం ధరలు క్షీణించాయి.
 
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.220 తగ్గుదలతో రూ.42,670 నుంచి రూ.42,450 మేరకు పడిపోయింది. బంగారం ధరలు ఇలా వుంటే వెండి ధర ఏకంగా రూ.500 పతనమై రూ.49,000 నుంచి రూ.48,500కు పడిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు