మందారం: ఈ పూల రసాన్ని ప్రతిరోజూ కొబ్బరినూనె రాసుకున్నట్లుగా పట్టిస్తే జుట్టు రాలే సమస్య అదుపులో వుంటుంది. దీని కోసం ఎండబెట్టిన మందార పూలను నీళ్లలో వేసి మరిగించి, సన్నటి వస్త్రంలో వడకట్టి చల్లార్చుకోవాలి. ఈ రసాన్ని తలకు రాసుకోవాలి.
మందార తైలం: నాలుగు కప్పుల మందార పూల రసం లేదా కషాయానికి కప్పు కొబ్బరినూనె కలపాలి. ఆ తర్వాత నూనె మత్రమే మిగిలేలా సన్నటి మంటపై కాచి చల్లార్చాలి. దీనిని వడకట్టి శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకుని తల నూనెగా వాడుకోవాలి. దీనితో జుట్టు రాలడం తగ్గి, నల్లగా నిగనిగలాడుతుంది.