ఈ సదస్సులో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్, హైదరాబాద్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్; శరత్ సిటీ మాల్ సీఓఓ ఇంద్రనీల్ మజుందార్; నోవార్టిస్ డీ అండ్ ఐ గ్లోబల్ హెడ్ అపర్ణ పాఠక్; డీ అండ్ ఐ మరియు సీఎస్ఆర్ డైరెక్టర్ నేహా గుప్తా; ఎల్జీబీటీ ఈఆర్జీ లీడ్ హర్ష రవితో పాటుగా పలు కార్పోరేట్ సంస్ధల ప్రతినిధిలు, డైవర్శిటీ అండ్ ఇన్‌క్లూజన్ హెడ్స్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సాయంత్రం బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్- హైదరాబాద్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కీలకోపన్యాసంతో ప్రారంభమైంది. డీ అండ్ ఐ ఆవశ్యకతను ఆయన వెల్లడించారు. ఎల్జీబీటీ+ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము దేశవ్యాప్తంగా ప్రారంభించిన కార్యక్రమాలు 450కు పైగా గ్రూప్స్‌కు చేరువైందన్నారు. తెలుగు రాష్ట్రాలలో తాము పలు క్వీర్ ఉద్యమకారులు, సంస్ధలతో కలిసి పనిచేస్తున్నామంటూ ఇక్కడ ఇంకా చేసేందుకు చాలా అవకాశముందన్నారు. ఎల్జీబీటీ+ హక్కులకు కట్టుబడిన ఎన్నో భారతీయ సంస్ధలతో కలిసి పనిచేస్తుండటం పట్ల గర్వంగా ఉన్నట్లు తెలిపారు.
అనంతరం డైవర్శిటీ అండ్ ఇన్‌క్లూజన్‌పై ఓ చర్చా కార్యక్రమం జరిగింది. దీనిలో నోవార్టిస్ డీ అండ్ ఐ గ్లోబల్ హెడ్ అపర్ణ పాఠక్‌తో పాటుగా హర్ష రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎల్‌జీబీటీక్యుఐఏ+ కమ్యూనిటీ వ్యక్తులకు సాంకేతికత నైపుణ్యాలైనటువంటి డాటా ఎనాలసిస్, డిజిటల్ మార్కెటింగ్ తదితర అంశాలలో శిక్షణ అందించేందుకు ప్రాజెక్ట్ ఇంపాక్ట్ శీర్షికన నూతన ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌ను పలు కార్పోరేట్ సంస్ధల డీ అండ్ ఐ హెడ్స్ సహకారంతో అమలు చేయనున్నారు.
కార్యక్రమంలో భాగంగా గుడ్ యూనివర్శ్ ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆర్కెమ్ ఫార్మా-వీపీ కార్పోరేట్ ఎఫైర్స్, సీఎస్ఆర్ రవి కుమార్ పీసపాటి; స్టేట్ స్ట్రీట్ వీపీ హరీష్; నిమ్స్‌లో సీనియర్ మెడికో సోషల్ వర్కర్ పార్వతి గుజ్జారీ, శరత్ సిటీ సీఓఓ ఇంద్రనీల్ విడుదల చేశారు. డ్రాగ్ ఆర్టిస్ట్ పాత్రుని శాస్త్రి ప్రదర్శనలతో పాటుగా కిరణ్, సాజిత్లు తీసిన ఫోటో ప్రదర్శన సైతం చేశారు.