గతేడాది జులైలో జీఎస్టీ రూపంలో రూ.1.82 లక్షల కోట్లు వసూలైంది. జీఎస్టీ వసూళ్లు గత కొన్ని నెలలుగా రూ.1.8 లక్షల కోట్లుపైగానే స్థిరంగా నమోదవుతూ వస్తున్నాయి. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇది వరుసగా ఏడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.37 లక్షల కోట్లు వసూళ్లు సాధించగా.. జూన్‌లో రూ.1.85 లక్షల కోట్లు వసూళ్లు నమోదయ్యాయి.