జుట్టు రాలే సమస్యలను సమస్యలను పరిష్కరించడంలో హిమాలయ...

శనివారం, 26 ఫిబ్రవరి 2022 (22:09 IST)
భారతదేశంలోని ప్రముఖ వెల్‌నెస్ బ్రాండ్‌లలో ఒకటైన హిమాలయ వెల్‌నెస్ కంపెనీ, తన యాంటీ-హెయిర్ ఫాల్ షాంపూ, కండిషనర్‌ల కోసం కొత్త టీవీసీని విడుదల చేసింది. జుట్లు రాలే సమస్యలను ఎదుర్కొనడంలో ట్రయల్ అండ్ ఎర్రర్‌ల ఉత్కంఠ రేకెత్తించే ప్రయాణంలో హిమాలయ యాంటీ-హెయిర్ ఫాల్ షాంపూ, కండీషనర్‌ని 96% వరకు సమస్యను పరిష్కరిస్తుందని రుజువు చేయడాన్ని హైలెట్ చేసే దిశలో సంస్థ ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.

 
ఈ చిత్రం జుట్టు సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనడం చుట్టూ తిరుగుతుంది. కొత్తగా జుట్టు సంరక్షణ విధానాలను ప్రయత్నించేటప్పుడు వినియోగదారులు ఎక్కువ సమయం తీసుకుంటూ, ఖరీదైన ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. హిమాలయా వెల్‌నెస్ కంపెనీ పర్సనల్ కేర్ విభాగం జనరల్ మేనేజర్ సుశీల్ గోస్వామి మాట్లాడుతూ, “మేము భారతదేశంలో ప్రముఖ హెర్బల్ హెయిర్ కేర్ బ్రాండ్‌గా ప్రతి జుట్టు రకం సమస్యను సహజంగా పరిష్కరించడంలో మేము ఉత్తమ ఫలితాలు అందుకుంటున్నందుకు హర్షిస్తున్నాము. ఈ క్యాంపెయిన్‌ ద్వారా వినియోగదారుల శిరోజాల సమస్యలకు హిమాలయ ఉత్పత్తిని మొదటి ఎంపికగా చేసే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము’’ అని తెలిపారు.

 
టెన్నిస్ మ్యాచ్‌లో తన విజయాన్ని సంబరం చేసుకుంటూ, తన జుట్టుతో ఆడుకునే అమ్మాయితో ఆనందంగా ఉండడంతో ఈ వాణిజ్య ప్రకటన ప్రారంభమవుతుంది. ఒక స్నేహితురాలు ఆమె అందమైన వస్త్రాలను చూపించినందుకు ఆమెను ఎగతాళి చేయడం కనిపిస్తుంది. ఇది ఆమె ఆరోగ్యకరమైన-దృఢమైన జుట్టును పెంచుకునేందుకు ఆమె చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని మరియు జుట్టు రాలే సమస్యల కారణంగా ఆమె ఎదుర్కొన్న రోజువారీ కష్టాలను గుర్తుచేస్తుంది. ఈ చిత్రం తర్వాత హిమాలయ యాంటీ-హెయిర్ ఫాల్ సొల్యూషన్‌ను పరిచయం చేయడం కొనసాగుతుంది. ఇది భృంగరాజా మరియు పలాషా తదితర సహజ పదార్థాల ప్రయోజనాలను మిళితం చేసి, జుట్టు రాలడాన్ని 96% వరకు తగ్గిస్తుందని ప్రకటిస్తూ, చివరికి ‘హెయిర్ ఫాల్ కా సాహి సొల్యూషన్’ నినాదంతో ప్రకటన ముగుస్తుంది.

 
సౌత్ 82.5 కమ్యూనికేషన్స్ గ్రూప్ క్రియేటివ్ డైరెక్టర్లు సంగీత సంపత్ మరియు రవికుమార్ చెరుస్సోలా మాట్లాడుతూ, “మా సందేశాన్ని క్లుప్తంగా, మరింత దృఢంగా వినిపించడమే మా లక్ష్యం. ట్రయల్-అండ్-ఎర్రర్‌ల నిరాశను గుర్తించడం, ప్రయోగాలతో పడే బాధలు మరియు హిమాలయ యాంటీ-హెయిర్ ఫాల్ సొల్యూషన్ ప్రయోజనాలు వివరించడం మాకు కొన్ని కీలక క్షణాలుగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు