హిమపాతంలో చిక్కుకుపోయిన నేవీ అధికారులు.. ఎక్కడ?

శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:28 IST)
హిమాలయాల్లోని త్రిశూల పర్వతాల అధిరోహణకు వెళ్లి భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన ఇండియన్ నేవీకి చెందిన అయిదుగురి కోసం గాలింపు, సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇండియన్ నేవీకి చెందిన 20 మంది బృందం త్రిశూల పర్వతాల అధిరోహణకు ముంబయి నుంచి సెప్టెంబర్ 3న బయలుదేరింది.
 
ఒక పర్వత శిఖరాగ్రానికి చేరేందుకు వీరిలో 10 మంది బృందం శుక్రవారం(అక్టోబర్ 1) ముందుకు కదిలింది. శిఖరాగ్రానికి అత్యంత సమీపంలో వారు భారీ హిమపాతంలో చిక్కుకుపోయారు. ఆ పదిమందిలో అయిదుగురిని కాపాడగలిగారు. 
 
మిగతా అయిదుగురి కోసం గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు. భారత సైన్యం, భారత వాయు సేన, ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాల సహాయంతో ఇండియన్ నేవీ ఈ గాలింపు, సహాయ చర్యలు చేపట్టింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు