రెపో రేటును పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

బుధవారం, 7 డిశెంబరు 2022 (13:03 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటును పెంచింది. రెపో రేటును 0.35 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తి కాంత దాస్ తెలిపారు. దీంతో రుణాలపై వడ్డీ భారంపెరగనుంది. 
 
జీడీపీ వృద్ధిరేటు అంచనాలు 6.8 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థ అక్టోబర్ నెలలోనూ బలపడినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ అక్టోబర్ లోనూ బలపడినట్లు శక్తికాంతదాస్ వెల్లడించారు. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయలు పెరగడం గ్రామీణ డిమాండ్ కోలుకుంటున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు