సాధారణంగా నెంబరు కోసం దరఖాస్తు చేసి, వేచి చూసి, విసిగి మరో దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు నంబర్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు.. స్త్రీలు పెళ్లి కాక ముందు ఒక నంబరు, పెళ్లి అయ్యాక ఒక నంబరు పొంది ఉండవచ్చు.
ఒక అస్సెసీకి రెండు వేరు వేరు నంబర్లు ఉంటే సెక్షన్ 272బీ ప్రకారం పెనాల్టీ వేస్తారు. పెనాల్టీ మొత్తం రూ. 10,000. ఒకవేళ మీకు రెండు నంబర్లు ఉంటే ఒక దానిని సరెండర్ చేయండి. అసలు ఒకదానిని ఎటువంటి సందర్భంలోనూ వాడకండి. పక్కన పెట్టండి. ఆ నంబరును సరెండర్ చేయండి.