భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ డిమాండ్‌.. ఏపీ-తెలంగాణ నుంచే అందుబాటులో 13 లక్షల వస్తూత్పత్తులు

శుక్రవారం, 19 మే 2017 (04:24 IST)
భారతీయ వస్తువులకు  కనీ వినీ ఎరుగని, ఊహించని మార్కెట్ ఆమెరికాలో ఏర్పడింది. వైవిధ్యపూరితమైన ఉత్పత్తులు, ఎవరికీ తీసిపోని నాణ్యత, సరసమైన ధర ఈ మూడింటి మేలికలయికతో భారతీయ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్త డిమాండును సాధిస్తున్నాయి. ఎంత భారీ స్థాయిలో ఉంటే కోట్లాది వస్తు ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొలువు దీరిపోయాయి. ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వేదికగా ఇప్పుడు 4.5 కోట్లకుపైగా భారతీయ ఉత్పత్తులు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచే 13 లక్షల వస్తూత్పత్తులు ఉన్నాయంటే మన వస్తువులు విదేశాల్లో ఎలాంటి ఆదరణ పొందుతున్నాయో తెలుసుకోవచ్చు.
 
కస్టమర్ల ఆదరణతో యూఎస్‌లో ఇండియా బజార్‌ పేరుతో ప్రత్యేక పేజీని ప్రారంభించామని అమెజాన్‌ ఇండియా గ్లోబల్‌ సెల్లింగ్‌ హెడ్‌ అభిజిత్‌ కమ్రా తెలిపారు. భారతీయ ప్రొడక్టులకు యూఎస్, యూకే, జర్మనీలు టాప్‌–3 మార్కెట్లుగా ఉన్నాయని చెప్పారు. హోమ్‌ ఫర్నీషింగ్, అపారెల్, జువె ల్లరీకి ఎక్కువగా డిమాండ్‌ ఉందని వివరించారు. మొత్తంగా భారత్‌ నుంచి ప్రతి రోజు 1,80,000 ప్రొడక్టులు అమెజాన్‌ గ్లోబల్‌ వెబ్‌సైట్లలో నమోదవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. 
 
అమెజాన్‌ 2015 మే నుంచి భారతీయ ఉత్పత్తులను విదేశాల్లో అమ్మడం ప్రారంభించింది. 20,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారు. వీరిలో 50 శాతంపైగా అమ్మకందారులు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఉన్నారని అభిజిత్‌ తెలిపారు. ‘విక్రేతలకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మధ్యవర్తులు లేరు. ధర నిర్ణయం అమ్మకందారులదే.అమెజాన్‌కు చెల్లించే కమీషన్‌ పూర్తిగా పారదర్శకం. ఇక వర్తకులకు భారత కరెన్సీలో ఆదాయం సమకూరుతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ట్రేడర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పైగా ఉత్పత్తుల నమోదు, ఎగుమతి బాధ్యతలు మావే. వివిధ మార్కెట్లలో డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులు, డిజైన్ల గురించి ముందే అలర్ట్‌ చేస్తున్నాం. తరచూ శిక్షణ, అవగాహన చేపడుతున్నాం. 
 

వెబ్దునియా పై చదవండి