ఆ బాలుడిని ఫ్లైట్‌లోకి అనుమతించని ఇండిగో-రూ.5 లక్షల జరిమానా
ఆదివారం, 29 మే 2022 (15:08 IST)
మానసిక వైకల్యమున్న బాలుడు ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ విమానం ఎక్కబోయాడు. కానీ సదరు బాలుడిని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే.
ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడని ఇండిగో వాదించింది. ఈ ఘటనను ఇండిగో ఎయిర్‌లైన్స్ మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది.
ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది. ఇంకా ఇండిగో విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది.