అంతర్జాతీయ నేరగాళ్ల చేతిలో భారత బ్యాంకుల డెబిట్ కార్డుల సమాచారం

శనివారం, 22 అక్టోబరు 2016 (11:37 IST)
అంతర్జాతీయ నేరగాళ్ళ చేతిలో భారతదేశానికి చెందిన 19 బ్యాంకుల డెబిట్ కార్డుల సమాచారం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇది తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. 
 
తాజాగా, మన బ్యాంకులపై పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు దాడులు జరిపే అవకాశం ఉందని సైబర్ భద్రతా ఏజన్సీ హెచ్చరించింది. దీంతో, బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు నోటీసులు కూడా అందాయి. 
 
ఈ సైబర్ భద్రతా ఏజన్సీ ఆర్బీఐతో కలసి పనిచేస్తుంది. భారత ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన విభాగం ఇది. భారత బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద భద్రతా ఉల్లంఘన జరిగిందని, 32 లక్షల డెబిట్ కార్డుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిందని గత వెల్లడైంది. 

వెబ్దునియా పై చదవండి