భారతదేశంలో అత్యధికంగా విక్రయమవుతున్న నెక్సన్ ఈవీ

శుక్రవారం, 30 జూన్ 2023 (19:09 IST)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ అయిన నెక్సన్ ఈవీ 50 వేల విక్రయ మార్కును సాధించినట్లు భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు, భారతదేశంలో ఈవీ పరిణామానికి మార్గదర్శి అయిన టాటా మోటార్స్ నేడిక్కడ ప్రకటించింది. 2020లో ప్రారంభించినప్పటి నుండి నెక్సన్ ఈవీ భారతదేశంలోని ఈవీ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇది చాలా దూరాలను కవర్ చేయగల సామర్థ్యం కలిగి, ఇంటి కోసం ఎంపిక చేసుకునే వాహనంగా ఇది ప్రజలకు ఫస్ట్-హ్యాండ్ ఈవీ అనుభవాన్ని అందించింది. భారతీయ కొనుగోలుదారులు ఈవీలను కొనేందుకు మొగ్గు చూపడంలో ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించడానికి నెక్సన్ ఈవీ ప్రారంభించబడింది, ఎలక్ట్రిఫైడ్ మొబిలిటీ దిశగా భారతదేశ ప్రయాణాన్ని ప్రారంభించిన ఉత్పత్తిగా మారింది.
 
నెక్సన్ ఈవీ ప్రస్తుతం భారతదేశంలోని 500కి పైగా నగరాల్లో విక్రయించబడుతోంది. వివిధ ప్రాంతాలలో 900 మిలియన్ కి.మీ.లకు పైగా డ్రైవ్ చేయబడింది. ఇంకా నడపబడుతూనే ఉంది. ఇది 50 వేల బలమైన నెక్సన్ ఈవీ కమ్యూనిటీ విశ్వాసాన్ని చూరగొంది. వారు ఒక్క విడతలోనే 1500 కి.మీ. వరకు సుదీర్ఘ పర్యటనలు చేస్తున్నారు. సగటున, నెక్సన్ ఈవీ యజమానులు 100 నుండి 400 కి.మీ వరకు ఇంటర్‌సిటీ & అవుట్‌స్టేషన్ ట్రిప్‌లలో మొత్తంగా ఒక నెలలో దాదాపు 6.3 మిలియన్ కి.మీ. వరకు తిరుగుతున్నారు. ఇది భారతదేశంతో పెరిగిపోతున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కూడా శక్తిని పొందింది. ఇది 2021, 2023 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో 1500% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. ఈరోజు, మన దేశంలో 6,000కి పైగా ఛార్జింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ఇవి ఈవీలను స్వీకరించడానికి ఉన్న అడ్డంకులు ఎలా బద్దలు కొడుతున్నాయో తెలియజేస్తున్నాయి.
 
ఈ మైలురాయిని అధిగమించడంపై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్, సర్వీస్ స్ట్రాటజీ హెడ్, మిస్టర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, “నెక్సన్ ఈవీ ఒక కూల్, స్టైలిష్, ప్రాక్టికల్‌ని అందించే లక్ష్యంతో భారతదేశం స్వంత ఎలక్ట్రిక్ ఎస్యూవీగా పరిచయం చేయబడింది. భారతదేశంలో వేగవంతమైన ఈవీ స్వీకరణ కోసం వాస్తవ-ప్రపంచ పరిష్కారం. నెక్సన్ ఈవీ కస్టమర్లు కేవలం 3 సంవత్సరాలలోనే 50 వేలకి పెరిగారు. భారతదేశం ఈవీలను ప్రస్తుత కాలపు చలనశీలతగా ఎలా స్వీకరించిందో చెప్పడానికి ఇది నిదర్శనం. నెక్సన్ ఈవీ వాగ్దానాన్ని విశ్వసించి, ఈవీ ఎకోసిస్టమ్‌ని నిర్మించడానికి, ఇప్పుడు ఉన్నట్టుగా మార్చడానికి వీలు కల్పించిన ప్రారంభంలోనే వీటిని కొనుగోలు చేసిన వారికి మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరింతమంది ఈవీ వాగ్దానాన్ని అనుభవిస్తారని మేం ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
 
453 కిమీల మెరుగుపర్చబడిన రేంజ్‌తో శక్తివంతమైన నెక్సన్ ఈవీ, కాశ్మీర్ నుండి కన్యాకుమారి డ్రైవ్‌ను వేగంగా పూర్తి చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లోకి విజయవంతంగా ప్రవేశించింది. ఇది 4003కి.మీ.ల డ్రైవ్‌ను కేవలం 95 గంటల 46 నిమి షాల్లో (4 రోజులలోపు) పూర్తి చేసింది. బహుళ-నగర ప్రయాణాలను చేపట్టగల సామర్థ్యాన్ని విజయవంతంగా నిరూపించుకుంది. డ్రై వింగ్ సమయంలో, నెక్సన్ ఈవీ, సవాళ్లతో కూడిన భూభాగాలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులలో ఇతర కార్ల మాదిరి గానే నడపబడింది, సగటు వాస్తవ-ప్రపంచ పరిధి 300+కి.మీ.ని సులభంగా అందించింది. ఈ రికార్డ్-బ్రేకింగ్‌ డ్రైవ్‌లో మొత్తం 25 రికార్డులు సాధించబడ్డాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు