జూనియర్ అంబానీ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ అందరికీ గుర్తుండే ఉంటాడు.. ఐపీఎల్ సందర్భంగా ముంబయి ఇండియన్స్ మ్యాచ్ల్లో అప్పుడప్పుడూ తన భారీకాయంతో అందరినీ దృష్టినీ ఆకర్షించిన ఆయన ఇప్పుడు ఒక్కసారిగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. కొద్దినెలల క్రితం వరకు భారీ కాయంతో కనిపించిన ఆయన ఒక్కసారిగా సన్నబడి అందరికీ షాకిచ్చాడు.