ఏ వెబ్‌సైట్ కానీ లేదంటే ఇతరులు, వ్యాపారులు ఇలా ఎవ్వరూ కూడా కంపెనీ అనుమతి లేనిదే ఎల్‌ఐసీ లోగో ఉపయోగించకూడదని తెలిపింది. అలా చేసినవారికి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా.. మరో విషయంపై కూడా కస్టమర్లను ఎల్ఐసీ అలర్ట్ చేసింది.
మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలిని కోరింది. ఎల్ఐసీ అధికారులు ఫోన్ కాల్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ నెంబర్లు, నామినీ వివరాలు అడగరు అని స్పష్టం చేసింది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.