విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేయగానే.. మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. అయితే ఎటువంటి మినహాయింపు లేకుండా కంపెనీలు పన్ను 22 శాతం కట్టేందుకు ఐటీ చట్టాన్ని మార్చనున్నట్లు మంత్రి తెలిపారు. కనీస ప్రత్యామ్నాయ పన్నును (మ్యాట్)ను ఎత్తివేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాంటి కంపెనీలు 25.17 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు.