పెట్రో వడ్డన.. వరుసగా ఐదో రోజు పెరిగిన ధరలు...

మంగళవారం, 24 నవంబరు 2020 (10:00 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా పెరిగిపోయాయి. రోజువారి ధరల సమీక్షలో భాగంగా, పెట్రోల్‌పై 8 పైస‌లు, డీజిల్‌పై 18 నుంచి 20 పైస‌లు పెంచుతూ దేశీయ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.81.59కి, డీజిల్ ధ‌ర రూ.71.41కి పెరిగింది. 
 
అదేవిధంగా మూడు మెట్రో న‌గ‌రాల్లో కూడా ధ‌ర‌లు పెరిగ‌న‌ట్లు ఇండియ‌న్ ఆయిల్ కంపెనీ ప్ర‌క‌టించింది. దీంతో ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.88.29, డీజిల్ ధ‌ర రూ.77.90గా ఉన్న‌ది. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.84.64, డీజిల్ రూ.76.88, కోల్‌క‌తాలో పెట్రోల్‌ రూ.83.15, డీజిల్ రూ.74.98, హైద‌రాబాద్‌లో పెట్రోల్ రూ.84.86  డీజిల్ రూ.77.93గా ఉన్నాయి. 
 
కాగా, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ మ‌ధ్య పెట్రోల్ ధ‌‌ర‌లు వ‌రుస‌గా నెల‌రోజుల‌పాటు పెరిగాయి. ఈ ప‌రంప‌ర సెప్టెంబ‌ర్ 22న నిలిచింది. అదేవిధంగా ఆగ‌స్టు మూడో వారం నుంచి అక్టోబ‌రు 2 వ‌ర‌కు డీజిల్ ధ‌ర‌లు పెరుగూతూనే ఉన్నాయి. అప్ప‌టి నుంచి ఆగిన పెట్రో ధ‌ర‌ల మంట మ‌ళ్లీ గ‌త శుక్ర‌వారం నుంచి ప్రారంభ‌మైంది. వ‌రుస‌గా నేటివ‌ర‌కు ప్ర‌తిరోజూ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూనే వ‌స్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు