పెప్సీ - కోకాకోలా కూల్‌డ్రింక్స్‌పై నిషేధం : తమిళనాడు సర్కారు నిర్ణయం?

బుధవారం, 1 మార్చి 2017 (17:06 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెప్సీ, కోకాకోలా వంటి విదేశీ శీతల పానీయాల విక్రయాలను నిలిపివేయనుంది. నిషేధాన్ని విధించింది. వ్యాపార సంస్థలన్నీ స్థానిక బ్రాండ్లనే విక్రయించాలని ఇప్పటికే తీర్మానాలు చేసిన విషయం తెల్సిందే. 
 
వాస్తవానికి తమిళ ప్రజలు తమ సంప్రదాయాలకు, కట్టుబాట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమది కానీ సంస్కృతి, కట్టుబాట్లకు వారు ఆమడ దూరంలో ఉంటారు. తమ సంస్కృతిని నిలుపుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా వారు సిద్ధపడతారు. దీనికి ఉదాహరణ ఇటీవల జల్లికట్టు ఉద్యమమే. 
 
అంతేకాదు తమిళభాషాభివృద్ధికి ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తారు. ఈ మంత్రి పదవికి కేమినెట్ హోదాను కూడా కల్పిస్తారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు సైతం తమిళభాషలోనే వాటికి పేరు పెట్టుకోవడం వారి ప్రత్యేకత. అలాంటి తమిళ ప్రజలు ఇపుడు విదేశీ శీతలపానీయాలు విక్రయించకూడదని తీర్మానం చేయగా, దానికి అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి