పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి.. పెట్రోల్ ఎప్పుడూ సెంచరీ కొట్టేయగా.. డీజిల్ సైతం చాలా ప్రదేశాల్లో సెంచరీని బీట్ చేసింది. అయితే, ఇప్పట్లో పెట్రోల్‌పై వడ్డింపు ఆగేలా కనిపించడంలేదు. ఎందుకంటే.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని తెలిపారు.
వ్యాక్సిన్లు మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం డబ్బు ఖర్చు చేయడంతో పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించడానికి కేంద్రం భారీగా ఖర్చు చేస్తోందని తెలిపారు నిర్మలా సీతారామన్.. కాబట్టి, పెట్రోల్‌పై పన్నులు లేదా సుంకాలను తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చు అన్నారు.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తేనే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాగలం అన్నారు.