మరో 10 బ్యాంకుల విలీనం : నిర్మలా సీతారామన్

శుక్రవారం, 30 ఆగస్టు 2019 (17:32 IST)
దేశంలో మరో పది బ్యాంకులను విలీనం చేయనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రటించారు. ఆమె శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలో చిన్న చిన్న బ్యాంకులను విలీనం చేశామని గుర్తు చేశారు. అలాగే, ఇపుడుమరో 10 బ్యాంకులను విలీనం చేసి.. 4 అతిపెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. 
 
ఈ ప్రక్రియలో భాగంగా, పీఎన్‌బీ, ఓబీసీ, యునైటెడ్‌ బ్యాంకులు విలీనం కానున్నాయని తెలిపారు. ఈ 3 బ్యాంకుల కలయికతో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడుతుందని తెలిపారు. ఈ బ్యాంకు రూ.17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు.
 
అలాగే, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, యూబీఐలు కలిసి ఒకే బ్యాంకుగా ఏర్పడనున్నాయని వెల్లడించారు. సిండికేట్‌ బ్యాంకులో కెనరా బ్యాంకు విలీనం చేస్తామని తెలిపారు. అలహాబాద్‌ బ్యాంకులో ఇండియన్‌ బ్యాంకు విలీనం అవుతుందన్నారు. వీటి కలయిక ద్వారా ఐదో అతిపెద్ద బ్యాంకుగా మారుతుందన్నారు. 
 
తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనున్నట్లు తెలిపారు. విలీనాల తర్వాత దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఎస్‌బీఐ, రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ అవతరించనున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు