అడ్వాన్స్ రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ... రైలు రాకపోకలపై...

గురువారం, 2 ఏప్రియల్ 2020 (20:08 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా దేశ వ్యాప్త లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో రైళ్ళ రాకపోకలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఈ నెల 14వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. అయితే 15వ తేదీ నుంచి యధావిధిగా రైళ్ళ రాకపోకలు కొనసాగుతాయనీ, ఇందుకోసం గురువారం నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకునేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. వీటిపై రైల్వే శాఖ గురువారం ఓ క్లారిటీ ఇచ్చింది. 
 
లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ నెల 15వ తేదీ తర్వాతి ప్రయాణాలకు రైల్వే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైనందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదనని చెప్పింది. తాము కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఏప్రిల్ 14వ తర్వాతి ప్రయాణాల కోసం రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్స్‌ను తాము నిలిపివేయనే లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 
 
కేవలం లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయయానికి అంటే మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వ తేదీల మధ్యలో ప్రయాణాల బుకింగ్స్‌ను మాత్రమే నిలిపివేశామని చెప్పింది. రైల్వే టికెట్ల కోసం 120 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ఉంటుందని తెలిపింది. అందువల్ల ఏప్రిల్ 15 తర్వాత జరిగే ప్రయాణాల కోసం లాక్‌డౌన్‌ విధించే చాలా రోజుల ముందు నుంచే బుకింగ్స్‌ ఓపెన్‌గా ఉన్నాయని పేర్కొన్నది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు