కదిలే రైలులో.. కూల్ కూల్‌గా మసాజ్ సెంటర్లు..

సోమవారం, 10 జూన్ 2019 (11:02 IST)
మన దేశంలో తొలిసారి కదిలే రైలులో రూ.100లకు మసాజ్ చేసుకునే సౌకర్యం రానుంది. దీనికి సంబంధించి రైల్వేకు చెందిన రాట్లం తరపున సిఫార్సు చేయబడింది. రైళ్లు నడుస్తూ వుంటే కదిలే రైళ్లలో కూల్ కూల్‌గా మసాజ్‌లు చేయించుకోవచ్చు. ఇందుకు వంద రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఇండియన్ రైల్వే దీనికి సంబంధించిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ- ఇండోర్ ఇంటర్‌సిటీ డెహ్రాడూన్- ఇండోర్, అమృతసర్-ఇండోర్ వంటి మార్గాల్లో దాదాపు 39 రైళ్లలో మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఇండియన్ రైల్వే తగిన చర్యలు తీసుకుంటోంది. ఇంకా మసాజ్ చేసేందుకు ఐదుగురు మసాజ్ నిపుణులకు ఉద్యోగావకాశాలు ఇస్తారు. ఈ పథకానికి ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని.. రైల్వే శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు