పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇక ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు..!

మంగళవారం, 6 అక్టోబరు 2020 (12:50 IST)
పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడాన్ని సులభతరం చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా కస్టమర్లకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది.  పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. పోస్టాఫీస్ గ్రామీణ్ డక్ సేవక్ బ్రాంచుల్లో చెక్ ఫెసిలిటీ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో డిపాజిట్లు, అకౌంట్సును విత్‌డ్రాయెల్ ఫామ్ (ఎస్‌బీ 7)తోనే తెరిచే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
 
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ నిర్ణయంతో ఇకపై సేవింగ్స్ పాస్‌బుక్, విత్‌డ్రాయెల్ ఫామ్ కలిపి అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు. లేదంటే కొత్త ఖాతా తెరవొచ్చు. గ్రామీణ్ డక్ సేవక్ బ్రాంచుల్లో ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. విత్‌డ్రాయెల్ ఫామ్ ద్వారా రూ.5,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. కొత్త పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెనింగ్‌కు కూడా ఇది వర్తిస్తుంది.
 
అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) వంటి స్కీమ్స్‌లో డబ్బులు దాచుకోవడం కూడా మరింత సులభం కానుంది.  అయితే రూ.5,000 వరకే లిమిట్ ఉంటుందని గమనించాలి. అదే రూ.5,000కు పైన డిపాజిట్లకు పోస్టాఫీస్ సేవింగ్స్ బుక్ అందించాల్సి ఉంటుంది. 
 
పే ఇన్ స్లిప్ కూడా ఇవ్వాలి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం గత వారంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో ఉన్న వారికే గత త్రైమాసికపు వడ్డీ రేట్లే కొనసాగుతాయి. డిసెంబర్ 31 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు