డబ్బును ఆదా చేయాలనుకునే వారికి ఓ శుభవార్త. పోస్టాఫీసుల్లో ఆ డబ్బును దాచుకునేందుకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. దీని కోసం మీరు ఒక స్కీమ్‌లో చేరాలి. అదే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ కన్నా అధిక వడ్డీ పొందొచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ తెరవడం వల్ల కచ్చితమైన రాబడి లభిస్తుంది.
బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో పోస్టాఫీసుకు చెందిన ఈ పథకంలో చేరడం ఉత్తమం. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లోనూ పలు రకాలు ఉన్నాయి. ఏడాది నుంచి మూడేళ్ల వరకు డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 5.5 శాతం వడ్డీ పొందొచ్చు. అదే ఐదేళ్ల వరకు ఎఫ్‌డీ చేస్తే 6.7 శాతం వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్ అందించే 6.7 శాతం వడ్డీ ప్రాతిపదికన చూస్తే మీ డబ్బు 10.74 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. అంటే 129 నెలల్లో రెట్టింపు డబ్బులు తీసుకోవచ్చు.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌ను పిల్లల పేరుపై కూడా తెరవొచ్చు. జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. కనీసం రూ.1000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. నామినేషన్ సదుపాయం ఉంది. అకౌంట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.