ఈ సమీక్షలో వడ్డీ రేట్లను పెంచేలా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా, కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేరకు పెంచవచ్చని బ్రిటీష్ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. రివర్స్ రెపో రేటును 0.20 నుంచి 0.25 శాతం మేరకు పెంచే అవకాశం ఉందని బార్‌క్లేస్ తెలిపింది.
కాగా, ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఊహించని విధంగా సమీకరణ పరిమాణాన్ని యూనియన్ బడ్జెట్ 2022-23లో పెంచినందుకు ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీై సంకేతాలు ఇస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.