డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగాదరుల భద్రతే లక్ష్యంగా గతంలో కష్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. అలాగే, గత సెప్టెంబరు నుంచి కార్డు టోకనైజేషన్ సర్వీసులపై కూడా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
కార్డు వినియోగదారుల అనుమతితోనే కార్డు డాటా టొకనైజేషన్ ముందుకుసాగాలని అందులో పేర్కొంది. అంటే, యూనిక్ ఆల్గరిథమ్ జనరేటెడ్ కోడ్‌తో కార్డు వివరాలను రీప్లేస్ చేసేందుకు టోకనైజేషన్ సహకరిస్తుంది. అయితే, ఈ కొత్త మార్గదర్శకాలన్నీ వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.