కస్టమర్లకు షాకిచ్చిన రిలయన్స్ జియో.. టారిఫ్ ధరలు భారీగా పెంపు!!

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (22:12 IST)
తమ మొబైల్ వినియోగదారులకు రిలయన్స్ జియో తేరుకోలేని షాకిచ్చింది. టారిఫ్ ధరలను ఒక్కసారిగా భారీగా పెంచేసింది. ఒక్కో ప్లాన్‌ మీద కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచుతున్నట్టు జియో గురువారం ప్రకటించింది. దాంతోపాటు కొత్త రీఛార్జి ప్లాన్లనూ తీసుకొచ్చింది. కొత్త టారిఫ్‌ అమలు నాటి నుంచి రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లలో మాత్రమే అపరిమిత 5జీ డేటా సౌకర్యం ఉంటుంది. ఈ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి.
 
జియో సేఫ్‌ - క్వాంటం సెక్యూర్‌ : ఇది కాలింగ్‌, మెసేజింగ్‌, ఫైల్‌ బదిలీతో పాటు కమ్యూనికేషన్‌ సదుపాయాలు అందించే యాప్‌. నెలకు రూ.199 చెల్లించి ఈ సర్వీసులు పొందొచ్చు. జియో ట్రాన్స్‌లేట్‌ - ఏఐ : ఈ యాప్‌ వాయిస్‌ కాల్‌, వాయిస్‌ మెసేజ్‌, టెక్ట్స్‌, ఇమేజ్‌లోని సమాచారాన్ని కృత్రిమ మేధతో అనువాదం చేస్తుంది. నెలకు రూ.99 కట్టి ఈ యాప్‌ సేవలు పొందొచ్చు. అయితే జియో యూజర్లకు ఈ రెండు సర్వీసులను ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు జియో పేర్కొంది. 
 
దేశంలో 2జీ నెట్‌వర్క్‌కు పరిమితమైన జియో వినియోగదారులు 250 మిలియన్ల మంది ఉన్నారని.. వారు డిజిటల్‌ సేవల్ని వినియోగించుకోలేక పోతున్నారని జియో టెలికాం పేర్కొంది. వీరిని కొత్త తరం డిజిటల్‌ వైపుగా తీసుకొచ్చేందుకు 4జీ సదుపాయంతో జియో భారత్‌, జియో ఫోన్‌లను తీసుకొచ్చినట్లు తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు