27-06-202 గురువారం రాశిఫలాలు - నిరుద్యోగయత్నాలు కలిసిరాగలవు...

రామన్

గురువారం, 27 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ॥ షష్ఠి రా.8.38 శతభిషం ప.2.06 రా.వ.8.03 ల 9.33. ఉ.దు. 9.48 ల 10.40 ప. దు. 3.00 ల 3.52.
 
మేషం :- ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. మీ జీవితభాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహాయం లభించక ఆందోళన చెందుతారు.
 
వృషభం :- స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగయత్నాలు కలిసిరాగలవు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సత్ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత చాలా అవసరం.
 
మిథునం :- వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రావలసిన ధనం చేతికందుతుంది. ఓ చిన్న విహారయాత్ర చేస్తారు. కుటుంబీకుల ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం :- దైవ, శుభకార్యాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఆచితూచి మాట్లాడడం మంచిది. బంధువుల రాకతో కుటుంబంలో ఉల్లాసం, సంతోషం కానవస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం మందిదికాదు. వారికి కాస్త దూరంగా ఉండండి.
 
కన్య :- ఆర్థికంగా అభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
తుల :- తరచూ బంధుమిత్రుల రాకపోకలుంటాయి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులు విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రత్యర్ధులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తికాన వస్తుంది.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మార్కెట్ రంగాలవారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. వాహనచోదకులకు మెళుకువ అవసరం. మీ కార్యక్రమాలు బంధువుల రాకతో మార్చుకోవలసి ఉంటుంది.
 
ధనస్సు :- ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిదికాదని గమనించండి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం.
 
మకరం :- చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. నూతన దంపతులకు సంతాన యోగం. మీరు చేసే పనికి ఫలితం మరోరకంగా ఉండే అవకాశం ఉంటుంది. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి.
 
కుంభం :- దేవాలయ విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు మీకు ఎంతో సంతృప్తి నిస్తాయి. మనసులో భయాదోళనలూ అనుమానాలు ఉన్నా, డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తిచేస్తారు.
 
మీనం :- మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకరిస్తారు. దంపతుల మధ్య పట్టింపులు, కలహాలు చోటుచేసుకుంటాయి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఇతరుల మాటలు లెక్కచేయక అడుగు ముందుకేసి శ్రమించండి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగినా సంతృప్తికరంగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు