ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎంసీఎల్ఆర్ కాలం తగ్గింపు

శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:03 IST)
SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా లోన్ తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి బెనిఫిట్ కలుగనుంది. స్టేట్ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఫ్రీకెన్సీని అంటే ఎంసీఎల్ఆర్ రీసెట్ కాలాన్ని తగ్గించింది. 
 
ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి బెనిఫిట్ కలుగనుంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఆర్‌బీఐ లేదా బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం కస్టమర్లకు త్వరితగతిన చేరుతుంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
 
'రుణ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందటానికి ఏడాది వరకు వేచి చూడాల్సిన పనిలేదు. ఎస్‌బీఐ తాజాగా ఎంసీఎల్ఆర్ రీసెట్ ఫ్రీక్వెన్సీని ఏడాది నుంచి 6 నెలలకు తగ్గించింది' అని స్టేట్ బ్యాంక్ ట్వీట్ చేసింది. అయితే ఈ నిర్ణయం ఏఏ రుణాలకు వర్తిస్తుందో స్పష్టత రావాల్సి ఉంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు