ప్రయాణీకులకు వీలుగా.. థీమ్‌లు, టారిఫ్, మోడల్‌తో కనెక్ట్ చేయబడిన ఇతర సౌకర్యాలను నిర్ణయించేందుకు ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే సిద్ధమైనాయి. దీని ప్రకారం భారత్ గౌరవ్ రైళ్లను ఆపరేట్ చేయడానికి వారి వ్యాపార నమూనాను ప్రైవేట్ సంస్థలకు నిర్ణయించే అవకాశం ఇవ్వబడింది. ఆసక్తి గల ఎవరైనా పాల్గొనేవారు - వ్యక్తిగత, భాగస్వామ్య సంస్థ, కంపెనీ, జాయింట్ వెంచర్లు మొదలైనవి తెలియజేయాల్సి వుంటుంది. దీనికోసం భారతీయ రైల్వేఅధికారిక వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు, ఇది 10 పనిదినాల కాలవ్యవధిలో ప్రాసెస్ చేయబడుతుంది.
రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్‌లు తమ ఆవశ్యకతకు అనుగుణంగా రేక్ ల డిమాండ్‌ను ఉంచే ఆప్షన్‌ని కలిగి ఉంటారు (కనీసం 14 కోచ్‌లు.. గరిష్టంగా 20 కోచ్‌లు వుండేలా) చూడాలి. అలాగే స్పష్టమైన పాలసీ మార్గదర్శకాల ప్రకారం ఛార్జీలు, ఫిక్సిడ్ మరియు వేరియబుల్ హాలేజ్ ఛార్జీలు, రైల్వేమౌలిక సదుపాయాల వినియోగం కొరకు స్టాబ్లింగ్ ఛార్జీలు, రోలింగ్ స్టాక్ కొరకు వారు ఛార్జ్ చేయబడతారు.
ఎస్‌సిఆర్ జనరల్ మేనేజర్, గజానన్ మాల్య మాట్లాడుతూ... ఎస్ సిఆర్ తన నెట్ వర్క్‌లో అనేక ప్రదేశాలను కలిగి ఉందని, ఇది గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్రా గమ్యస్థానాలను కలిగి ఉందని, దీనిని భారత్ గౌరవ్ రైళ్లు ప్రయాణీకుల ప్రయోజనం కోసం అనుసంధానించగలవని అభిప్రాయపడ్డారు.